ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 7:00 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

నాగేపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో వనమహోత్సవంపర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించాలి

నాగేపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో వనమహోత్సవంపర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించాలి.

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 25

రామగిరి మండలం నాగేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో పర్యావరణ పరిరక్షణ కోసం వనమహోత్సవ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కొండవెన దివ్యసుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన, స్ఫూర్తి పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ముఖ్యమని సర్పంచ్ తెలిపారు. మొక్కలు నాటడం ద్వారా పాఠశాల ఆవరణ మరింత పచ్చదనంతో, ఆహ్లాదకరమైన వాతావరణంగా మారుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్వప్న, ఉపసర్పంచ్ యాసం సతీష్, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, గ్రామ సంఘం సహాయకులు, క్షేత్ర సహాయకుడు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.